హైదరాబాద్: రాజమౌళిని ఈ గెటప్ లో చూస్తే షాక్ అవుతారు. 'బాహుబలి' సినిమావల్ల రాజమౌళి అవతారం పూర్తిగా మారిపోయింది. సినిమాలోని నాయకప్రతినాయక పాత్రల్లాగే ఆయన కూడా జుత్తు, గెడ్డం పెంచేశారు. సినిమా పూర్తయ్యేవరకు ఇక ఆ రూపం మారదేమో అనుకొన్నారంతా.అయితే... ఇంట్లో పిల్లలు మాత్రం జక్కన్న స్త్టెల్ మార్చాల్సిందే అని పట్టుబట్టారు. తీరిక వేళలో వాళ్లే హెయిర్ స్త్టెలిస్ట్‌లుగా మారి రాజమౌళి తలకట్టుని ఇలా సరికొత్తగా మార్చేశారు. ఆ సమయంలో తీసిన ఫొటోనే ఇది. రాజమౌళి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.'మా స్త్టెలిస్ట్‌లు ఇంకా 'ఏం చేస్తే బాగుంటుందా?' అని ఆలోచిస్తున్నారు, ఫలితంతో మయూఖ ఇంకా సంతృప్తి చెందలేనట్టుంది' అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ రాజమౌళి తలకట్టుతో ప్రయోగాలు చేస్తున్నది.. అనన్య (రాజమౌళి బంధువు, 'యమదొంగ' నిర్మాత చిరంజీవి కూతురు), కుముద్వతి (కీరవాణి కూతురు), మయూఖ (రాజమౌళి కూతురు), శ్రీసింహా (కీరవాణి అబ్బాయి).'బాహుబలి'కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 'ఛత్రపతి' తర్వాత ప్రభాస్‌తో ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై ట్రేడ్ లో ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రభాస్,అనుష్క పుట్టిన రోజులను పరస్కరించుకుని విడుదల చేసిన మేకింగ్ వీడియోలు ఇప్పటికే అందరిలో అమితమైన ఆసక్తిని రేపటంలో సఫలీకృతమయ్యాయి.అలాగే ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది? ఎప్పుడొస్తుంది? అసలు ఇప్పుడేం జరుగుతోంది? ఇంతకీ ఎలా ఉంటుంది ఆ సినిమా? ప్రభాస్ ఎలా కనిపిస్తాడు? ఎంత డబ్బుతో తీస్తున్నారు? ఇలా ఒకటేమిటి? ఒకరేమిటి? ఇతర చిత్ర పరిశ్రమలు కూడా మన 'బాహుబలి' గురించి ఆరాతీస్తున్నాయి. ఈ సినిమా గురించి ఎంత గోప్యంగా ఉంచుతూంటే అంత ఆసక్తి రేపుతోంది.ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గా కేరళలో ప్రభాస్ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజమౌళి కరెక్టుగా ఈగ విడుదలైన రోజు (సంవత్సరం క్రితం)న ఈ చిత్రం ఓపినింగ్ పెట్టుకున్నారు. షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగుతుంది.మరో ప్రక్క 'బాహుబలి' సినిమా కోసమే అన్నట్టుగా ప్రభాస్ కూడా ఓ వార్మప్ మ్యాచ్ ఆడాడు. అదే... 'మిర్చి'. ఇందులో ఆయన కత్తి పట్టి ప్రతినాయకులతో చెడుగుడు ఆడాడు. సూటూబూటూ ధరించి అమ్మాయిల మనసులతోనూ ఆడుకొన్నాడు. మ్యాచ్‌కి ముందు వార్మప్ అని ఒకటుంటుంది. సమరానికి సన్నద్ధమవ్వడంలాంటిదన్నమాట. అందులో ఆటగాళ్ల జోరుని చూసి తదుపరి మ్యాచ్ ఫలితంపై ఓ అంచనాకి వస్తుంటాం అలాగే బాహుబలిపై మిర్చి మరింత అంచనాలు పెంచేసింది.
No comments:
Post a Comment