Saturday, March 22, 2014

సమంత తో సమానంగా ఐటం గర్ల్ రెమ్యునేషన్

చెన్నై : ఐటం సాంగ్ చేసినందుకు దాదాపు హీరోయిన్ తో సమానంగా తీసుకుంటున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న యాక్షన్‌, కమర్షియల్‌ చిత్రం 'అంజాన్‌'. సమంత హీరోయిన్. ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. అందుకోసం కోటి రూపాయలు ఐటం భామకి ఇస్తున్నారు. హీరోయిన్ కీ దాదాపు కొంచెం అటూ ఇటూలో అదే మొత్తం ముట్టడం జరిగింది. దాంతో ఒక్క సాంగ్ కి ఆమె కి చెల్లించే మొత్తం...మొత్తం సినిమాలో చేసే హీరోయిన్ కి సమానం అనేది తెలిసి నోరు వెల్లబెడుతున్నారు.ముంబయి నేపథ్యంలో సాగే ఈ కథలోని ఓ ఐటం సాంగులో హిందీ నటి చిత్రాంగద నటిస్తోంది. 'నవ్వే నా స్పెషాలిటీ.. నేను సిల్క్‌స్మిత కమ్యూనిటీ..' అంటూ సాగే ఈ పాటను వివేకా రాశారు. ఇటీవలే ముంబయిలో ఈ పాటను చిత్రీకరించారు. ఇందుకోసం రూ.కోటితో సెట్‌ వేసిందట చిత్ర యూనిట్‌. ఈ ఒక్క పాట కోసం ఆమె రూ.కోటి పారితోషికం తీసుకున్నట్లు కూడా కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.విద్యుత్‌ జమ్వాల్‌, మనోజ్‌బాజ్‌పాయ్‌, వివేక్‌, బ్రహ్మానందం, సూరి తదితరులు నటిస్తున్నారు. యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌, తిరుపతి బ్రదర్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్‌ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్‌ డ్రాగన్‌ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్‌ సంతోష్‌శివన్‌ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.ఇక తన కొత్త సినిమా కోసం కమల్‌హాసన్‌ నటించిన చిత్రం శీర్షికను సూర్య ఎంచుకున్నారు. 'బిరియాని' తర్వాత వెంకట్‌ప్రభుతో తెరకెక్కించనున్న చిత్రానికి 'కల్యాణరామన్‌' అనే పేరు పెట్టారు. ఈ పేరుతో అప్పట్లో కమల్‌ హీరోగా ఓ చిత్రం వచ్చింది. పేరు పెట్టే ముందు కమల్‌తోపాటు ఆ చిత్ర దర్శకుడు పంజు అరుణాచలానికి కూడా విషయాన్ని వివరించారట వెంకట్‌ప్రభు. చిత్రానికి యువన్‌శంకర్‌ రాజా బాణీలు సమకూర్చనున్నారు. ఇది రీమేక్‌ కాదని... పేరు మాత్రమే పాతదని, కథ కొత్తదేనని వెంకట్‌ప్రభు స్పష్టం చేస్తున్నారు.
English SummaryChitrangada Singh has been signed to play an item number in forthcoming Tamil film Anjaan starring Surya. The makers of the film had tried their best to rope in Sonakshi Sinha, but she couldn't accept the offer for some reasons. As a result, the offer has fallen into the laps of Chitrangada.

No comments:

Post a Comment